వీకెండ్‌లో ఓటీటీ సినిమాల హవా.. టాలీవుడ్ హిట్ మూవీ కూడా! | List Of Movies, Web Series Release On OTT On Friday OTT Releases (June 14, 2024) | Sakshi
Sakshi News home page

This Weekend Ott Releases: ఓటీటీల్లో సినిమాల హవా.. ఒక్క రోజే 11 చిత్రాలు స్ట్రీమింగ్!

Jun 13 2024 7:03 PM | Updated on Jun 13 2024 7:37 PM

This Weekend Ott Movies Releases List Goes Viral

మరో వీకెండ్ రానే వచ్చింది. శుక్రవారం వస్తోందంటే చాలు అందరిచూపు ఏయే సినిమాలు వస్తున్నాయనే దానిపైనే ఉంటుంది. పండుగల సీజన్ కాకపోవడంతో పెద్ద పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో సుధీర్ బాబు హరోం హర సినిమాతో అలరించేందుకు వస్తున్నాడు. దీంతో పాటు ‍అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి, చాందినీ చౌదరి నటించిన యేవమ్‌ థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇవే కాకుండా ఓటీటీ ప్రియుల కోసం సినిమాలు సిద్ధమైపోయాయి. టాలీవుడ్‌ హీరో విశ్వక్‌ సేన్ నటించిన హిట్‌ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఈనెల 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా డియర్‌ నాన్న  మూవీ, నివేదాథామస్ నటించిన వెబ్ సిరీస్‌ పరువు, మంచు లక్ష్మి యక్షిణి వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు శుక్రవారం ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింక్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

   అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14

   గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14

   జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14

   మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

యక్షిణి(తెలుగు వెబ్ సిరీస్)- జూన్  14

ఆహా

   కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14
   డియర్ నాన్న(తెలుగు సినిమా)- జూన్ 14

ఆపిల్ ప్లస్ టీవీ

 క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14

జీ5

   లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14

   పరువు (తెలుగు వెబ్ సిరీస్) - జూన్ 14

బుక్‌ మై షో

ఫాల్ గాయ్(హాలీవుడ్‌ మూవీ)- జూన్‌ 14

 

Advertisement
 
Advertisement
Advertisement