‘కృష్ణ వ్రిందా విహారి’ ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ఎప్పుడంటే | Varshamlo Vennella From Krishna Vrinda Vihari Song To Out This Date | Sakshi
Sakshi News home page

‘కృష్ణ వ్రిందా విహారి’ ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ఎప్పుడంటే

Published Thu, Apr 7 2022 6:20 PM | Last Updated on Thu, Apr 7 2022 6:22 PM

Varshamlo Vennella From Krishna Vrinda Vihari Song To Out This Date - Sakshi

నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఏప్రిల్‌ 22న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు అనౌన్స్‌ చేసింది.“వర్షంలో వెన్నెల్లా” అనే సాంగ్‌ని ఏప్రిల్‌9న విడుదల చేయనున్నట్లు మూవీ టీం పేర్కొంది.  లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement