RGV: Ram Gopal Varma Tweet On The Kashmir Files Movie Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీపై ఆర్జీవీ రివ్యూ, ఏమన్నాడంటే..

Mar 15 2022 11:11 AM | Updated on Mar 15 2022 6:01 PM

Ram Gopal varma Tweet On The Kashmir Files Movie - Sakshi

నిజ సంఘటన ఆధారం బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్రి హోత్రి ఇటీవల తెరకెక్కించిన ది కశ్మీర్‌ ఫైల్స్‌కు మంచి స్పందన వస్తోంది. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలేక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు అంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ మూవీ మరింత పాపులరిటీ తెచ్చుకుంది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ట్వీట్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది.

చదవండి: యాంకర్‌ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్‌ రికార్డు ఇంకా ఉంది

ఈ సినిమా చూసిన ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్‌ని స్థాపించినట్టే. కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్. ది కశ్మీర్ ఫైల్స్ కమర్షియల్ సక్సెస్‌ని పక్కన పెడితే అంతకంటే కూడా భారీ విజయం సాధించింది’ అంటూ ఆర్జీవీ ప్రశంసలు కురించిపించాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమాపై ఆర్జీవీ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా హిందువులపై, 1980-90 దశకంలో కాశ్మీర్ పండిట్‌లపై జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు. జీ స్టూడియోస్, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. 

చదవండి: ‘రాధేశ్యామ్‌’ డైరెక్టర్‌ అసహనం

Advertisement
 
Advertisement
Advertisement