మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను తల్చుకుని ఏడ్చేసిన రతిక.. పల్లవి ప్రశాంత్‌ ఫేక్‌! | Bigg Boss 7 Telugu, Day 4: Rathika Rose Gets Emotional Over Her Ex-Boyfriend - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: మాజీ ప్రియుడిని ఏళ్లుగా మిస్‌ అవుతున్నా.. ఇప్పటికీ ఆ బాధ మనసులో నుంచి పోవట్లే.. ఏడ్చేసిన రతిక

Published Fri, Sep 8 2023 9:13 AM

Bigg Boss 7 Telugu, Day 4: Rathika Rose Gets Emotional Over Her Ex Boyfriend - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు ఫుల్‌ ఎనర్జీతో కనిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇస్తే ఆలస్యం గెలిచి తీరాల్సిందే అన్నంత కసిగా ఆడుతున్నారు. ఐదువారాల ఇమ్యూనిటీ పవర్‌ ఇస్తానని బిగ్‌బాస్‌ ఆశ పెట్టగానే హౌస్‌హేట్స్‌ మరింత అలర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో కొందరు మెప్పించగా మరికొందరు ఓవరాక్షన్‌ చేశారు. మరోపక్క అల్లరిపిల్లగా కనిపించే రతిక మాజీ ప్రియుడిని తలుచుకుంటూ కంటతడి పెట్టేసుకుంది. ఇంతకీ తాజా(సెప్టెంబర్‌ 7) ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో ఓసారి చూసేద్దాం..

లేడీ గెటప్‌లో ప్రిన్స్‌
బిగ్‌బాస్‌ తనను ఇంప్రెస్‌ చేసినవారికి ఇమ్యూనిటీ టాస్క్‌ బరిలో నిలిచే ఛాన్స్‌ ఇస్తానన్నాడు. దీంతో అమర్‌దీప్‌ అదుర్స్‌ సినిమాలో ఎన్టీఆర్‌ చారి పాత్రలో, రతిక.. బ్రహ్మీ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ప్రిన్స్‌ యావర్‌ లేడీ గెటప్‌ వేసుకుని ఇల్లంతా తిరిగాడు. అయితే శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల అయ్యే పని కాదని తనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్‌బాస్‌ను చెడామడా తిట్టేశాడు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్‌ మాత్రమే అని బుకాయించాడు. తనకు కాఫీ కావాలని మొన్నటి నుంచే అడుగుతున్నాడు శివాజీ. ఇప్పుడు మంచి ఛాన్స్‌ దొరకడంతో యాక్టింగ్‌ పేరుతో బిగ్‌బాస్‌ను నానామాటలు అని, అడ్డొచ్చిన వాళ్లను సైతం తిట్టి తన కోపాన్ని బయటకు కక్కాడు.

మెలికలు తిరిగిన రతిక
అటు గౌతమ్‌ను శివాజీ బీపీ చెక్‌ చేయమని, రతికను స్టెతస్కోప్‌తో అందరి గుండె ఏం చెప్తుందో చెప్పాలన్నాడు బిగ్‌బాస్‌. కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్‌ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు. ఇతడి అతి భరించలేక ఆఖరికి బిగ్‌బాస్‌ అతడిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి కాఫీ ఇచ్చి అతడి నోటికి తాళం పడేలా చేశాడు. మరోవైపు శుభశ్రీ ఏ పిల్లగాడా.. అంటూ పాట పాడుతూ పరికిణీలో స్టెప్పులేసింది. ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్‌బాస్‌ రతికను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు. మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు? అని అడగ్గా రతిక మెలికలు తిరిగిపోయింది. అమాయకంగా ఉండాలి, సంగీతంపై అవగాహన ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంది.

ఏళ్లుగా మిస్‌ అవుతున్నా
ఎవరినైనా మిస్‌ అవుతున్నావా? అని బిగ్‌బాస్‌ అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుంది. 'మిస్‌ అవుతున్నావా? అని అడిగితే ఎవరైనా పేరెంట్స్‌ పేరు చెప్తారు. కానీ వాళ్లు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్‌ అవుతామా? అంటే అది ఆ వ్యక్తే! మిస్సింగ్‌ ఫీలింగ్‌ అనగానే అతడే గుర్తొచ్చాడు. కొన్ని ఏళ్ల నుంచి మిస్‌ అవుతున్నాను. ఈ టాపిక్‌ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్‌ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను' అని పేర్కొంది. దీనికి బిగ్‌బాస్‌ బదులిస్తూ.. ఇప్పటివరకు నువ్వు ఎన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్‌ అని పాట ప్లే చేశాడు.

ప్రశాంత్‌ ఫేక్‌..
అనంతరం షకీలాను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి గాసిప్స్‌ సహా కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు. దీంతో షకీలా మాట్లాడుతూ.. 'ప్రశాంత్‌ స్ట్రాంగ్‌, కానీ ఫేక్‌ అనిపిస్తుంది. రతిక.. ప్రశాంత్‌ను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తుంది. గౌతమ్‌- శుభ్రీ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్ని బంధాలూ ఫేక్‌ రిలేషన్సే..' అని పేర్కొంది. టేస్టీ తేజ షో ప్రారంభంలో నాగ్‌ ఇచ్చిన బ్యాడ్జ్‌లను తాజా ఎపిసోడ్‌లో పంచాడు.  పెరుగన్నం బ్యాడ్జ్‌ శుభశ్రీకి ఇచ్చాడు. ఇందుకోసం ఆమె 20 సెకన్లపాటు తేజను ఎత్తుకుంది. మిర్చి బ్యాడ్జ్‌కు గానూ శోభాశెట్టి తేజతో రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేసింది. బర్గర్‌ బ్యాడ్జ్‌ను రతికకు ఇచ్చాడు. తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు.

డాక్టర్‌బాబు- మోనితల ట్రాక్‌
ఇంతలో తేజను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ ఇంట్లోని గాసిప్స్‌ గురించి ఆరా తీశాడు. 'శోభాకు కనెక్ట్‌ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు. డాక్టర్‌బాబు- మోనితల గురించి హౌస్‌లోనూ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్‌ను ఫేక్‌ అని చెప్పలేను, కానీ.. కావాలని కింద కూర్చుంటూ, కింద పడుకున్నాడేమో అనిపిస్తోంది' అని తెలిపాడు. ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ తనను ఇంప్రెస్‌ చేసిన కంటెస్టెంట్‌ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.

చదవండి: ఐ బొమ్మ వార్నింగ్‌ ఇవ్వడమేంటి?.. వైరలవుతున్న పోస్ట్!

 
Advertisement
 
Advertisement