తాళిబొట్టుతో షాకిచ్చిన హీరోయిన్ అనుపమ.. ఇంతకీ ఏమైంది? | Anupama Parameswaran's Siren Movie New Song Out - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: అనుపమకు పెళ్లయిపోయిందా? మరి ఈ ఫొటోలేంటి?

Published Tue, Jan 30 2024 2:33 PM

Anupama Parameswaran With Mangalsutra Siren Movie New Song - Sakshi

హీరోయిన్లు ఈ మధ్య వరసపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో చేస్తున్న పలువురు ముద్దుగుమ్మలు నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాళిబొట్టుతో ఉన్న కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు తొలుత షాకయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అలా రిలాక్స్ అయిపోయారు. ఇంతకీ ఏం  జరిగింది?

(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)

మలయాళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వీటితోపాటు తమిళ, కన్నడ మూవీస్‌లోనూ యాక్ట్ చేసింది. ఒకప్పటితో పోలిస్తే ఈమె చేతిలో పెద్దగా ఛాన్సులైతే లేవు. అలానే గతంలో క్రికెటర్ బూమ్రాతో ప్రేమలో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ అతడికి పెళ్లయిపోవడంతో ఆ తర్వాత అనుపమ పెళ్లి గురించి ఎలాంటి గాసిప్స్ ఏం రాలేదు.

కానీ తాజాగా పెళ్లి చీరతో మెడలో తాళిబొట్టు ఉన్న ఫొటోల్ని అనుపమ.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది తమిళ సినిమా 'సైరన్'లోని ఓ పాట కోసం రెడీ చేసిన లుక్ అని క్లారిటీ వచ్చేసింది. అంతే తప్ప అనుపమ పెళ్లి ఏం చేసుకోలేదు. కావాలంటే దిగువన ఉన్న ఈ పాట చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు హీరోయిన్)

Advertisement
 
Advertisement