
అడవి పందుల దాడిలో ముగ్గురికి గాయాలు
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలో కౌటగూడలో సోమవారం అడవిపందుల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కుమురం రవి, ప్రేమలత, రాజుబాయిలు ఉదయం 10 గంటల ఇంటి ముందు కూర్చొన్నారు. వీరిపై ఒక్కసారిగా అడవిపందులు వచ్చి దాడి చేయగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రేమలత, రాజుబాయిను మంచిర్యాలకు రెఫర్ చేశారు.
యువౖ రెతు కూడా..
కోటపల్లి: పంట కాపలా వెళ్లిన యువరైతు అడవి పందుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని బోరంపల్లికి చెందిన దుర్గం శేఖర్‌కు రాంపూర్ శివారులో వరి పొలం ఉంది. అడవి పందుల బెడద కారణంగా ఆదివారం రాత్రి పంటకు కాపలాగా ఉండేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అడవిపందులు ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి రైతులు వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.