
పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
నిర్మల్‌టౌన్: ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్, శాంతినగర్, చైన్‌గేట్ సమీపంలోని పలు పాన్‌షాపుల్లో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓసీబీ పేపర్స్ లభ్యం కాగా, సాధారణంగా వీటిలో గంజాయితో చుట్టి కాల్చడానికి ఈ పేపర్లు వాడతారని ఏఎస్పీ తెలిపారు. దీనిపై విచారణ చేయిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ సేవించిన, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఆర్‌ఎస్సై రవి, ప్రొబేషనరీ ఎస్సై జుబీర్, సుప్రియ, పోలీసు సిబ్బంది ఉన్నారు.