నెలకు మూడు చీరలు.. | - | Sakshi
Sakshi News home page

నెలకు మూడు చీరలు..

Jun 8 2025 12:44 AM | Updated on Jun 8 2025 12:44 AM

నెలకు

నెలకు మూడు చీరలు..

గతంలో మాస్టర్‌ వీవర్స్‌పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్‌ వీవర్స్‌ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా.

– దాస్‌పత్తి తిమ్ములు, నేత కార్మికుడు

అత్యంత ప్రామాణికంతో..

చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు

స్థల ప్రభావం లేదు..

ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా.

– పద్మ, నేత కార్మికురాలు

నెలవారీగా వేతనాలు..

అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య

చేనేత అంతరించకుండా..

పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం.

– మహంకాళి శేఖర్‌, కంపెనీ సీఈఓ

నెలకు మూడు చీరలు.. 
1
1/4

నెలకు మూడు చీరలు..

నెలకు మూడు చీరలు.. 
2
2/4

నెలకు మూడు చీరలు..

నెలకు మూడు చీరలు.. 
3
3/4

నెలకు మూడు చీరలు..

నెలకు మూడు చీరలు.. 
4
4/4

నెలకు మూడు చీరలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement