ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి.. | Sakshi
Sakshi News home page

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..

Published Sat, May 4 2024 12:40 AM

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..

నాగర్‌కర్నూల్‌ క్రైం/అమ్రాబాద్‌/లింగాల: గౌరవ ప్రదమైన ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అమ్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌ మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. లింగాలలో రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థకంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈప్రాంత సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించి, పరిష్కరించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎన్నికల ఇన్‌చార్జి నవీన్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ రాంబాబునాయక్‌, జగపతిరావు, హన్మంత్‌రెడ్డి, కేటీ తిరుపతయ్య, నాగేష్‌, రవీందర్‌రెడ్డి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

● రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి, 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్‌ పాలనలో 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటిని 15 జిల్లాలకు కుదించేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. జిల్లాల మార్పునకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి రెండుసార్లు ఎంపీగా గెలిచినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మల్లు రవిని ఎంపీగా గెలిపిస్తే, ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు నోట్ల కట్టలు తీసుకుపోయే వ్యక్తిగా మిగులుతాడే తప్ప.. ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయడని ఆరోపించారు. బీజేపీ మతాల మధ్య విద్వేషాలు రగిలిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దుచేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు తొలగిస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి జీఓ 46ను సవరించడంతో పాటు అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జి రంగినేని అభిలాష్‌రావు ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ది

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement