జనవరి 26 వరకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలు | Sakshi
Sakshi News home page

జనవరి 26 వరకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలు

Published Thu, Nov 23 2023 1:58 AM

- - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): ఈ నెల 25 నుంచి జనవరి 26వ తేదీ వరకు జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాట్లు చేయాలని వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రత్యేక పర్యవేక్షణ అధికారి కిరణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర నిర్వహణపై జిల్లా ప్రత్యేక పర్యవేక్షకులు, ఐఆర్‌ఎస్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ కుటుంబసంక్షేమ మంతిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ కిరణ్‌కుమార్‌.. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజనతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో యాత్ర కొనసాగనుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడమే యాత్ర ఉద్దేశమని తెలిపారు. యాత్ర నిర్వహణకు కలెక్టర్‌ చైర్మన్‌గా 36 శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌ అధ్యక్షుడిగా 10–12 మంది అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకు ప్రచారం నిమిత్తం 4 వ్యాన్లు రానున్నాయని, వాటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుస్మాన్‌ భారత్‌, పీఎం ఉజ్వల, కేసీసీ, పేదలకు ఉచిత గృహాలు, తదితర పథకాలకు అర్హులై ఉండి లబ్ధి పొందకపోతే వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన మాట్లాడుతూ జిల్లాకు ప్రచారం నిమిత్తం నాలుగు వ్యాన్లు రానున్నాయని, మొదట 25న గోనెగండ్ల, 26న గూడూరు, 27న ఓర్వకల్లు, 28న తేదీన కల్లూరు మండలాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలు ప్రారంభమవుతాయన్నారు. భారత్‌ వికసిత్‌ సంకల్ప యాత్రను జిల్లా అధికారులు పట్టుదలతో విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో 484 గ్రామ పంచాయతీల్లో

నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

ప్రభుత్వ పథకాలను అర్హులకు

చేర్చడమే యాత్ర ముఖ్య ఉద్దేశం

అధికారుల సమీక్షలో వికసిత్‌ భారత్‌

సంకల్ప యాత్ర ప్రత్యేక పర్యవేక్షణ

అధికారి కిరణ్‌కుమార్‌

Advertisement
Advertisement