‘బీఆర్‌ఎస్‌లోనే తగిన గుర్తింపు’
కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తే అవమానాలకు గురై నామమాత్రపు నాయకులుగా మిగిలిపోతారని, బీఆర్‌ఎస్‌లో తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న సిర్పూర్(టి) మాజీ ఎంపీపీ మాలతి మనోహర్ ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన మాట్లాడుతూ దోపిడీ నాయకుల నుంచి విముక్తి కోసం బీఆర్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. కార్యకుమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు కొంగ సత్యనారాయణ, తన్నీరు పోచం, మనోహర్, వాసు, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


