
బోధన అంశాలను విద్యార్థులకు నేర్పించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయులు వేసవి శిక్షణలో నేర్చుకున్న బోధన అంశాలను పాఠశాలలో విద్యార్థులకు నేర్పించాలని ప్రోగ్రాం రాష్ట్ర పరిశీలకులు కృష్ణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొ ని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశా రు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం కలిగేలా చూడాలన్నారు. అనంతరం ఎంఈవో సుభాష్ ఆయనను శాలువాతో సత్కరించారు.