వేర్వేరు ఘటనల్లో రూ.8 లక్షల వంచన | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో రూ.8 లక్షల వంచన

Published Sun, May 12 2024 11:00 AM

-

హుబ్లీ: వేర్వేరు ఘటనల్లో ఖాతాదారుల బ్యాంక్‌ ఖాతాల నుంచి రూ.8 లక్షల నగదును కేటుగాళ్లు బదలాయించుకుని వంచించారు. వివరాలు.. ఖాతాదారుడి దృష్టికి తేకుండానే వివిధ బ్యాంక్‌ ఖాతాల నుంచి రూ.6.39 లక్షలను కేటుగాళ్లు బదలాయించుకొని వంచించిన ఘటన చోటు చేసుకుంది. ధార్వాడలోని మిచిగన్‌ లేఅవుట్‌కు చెందిన మహంతేష్‌ కుందరిగి బాధితుడు. మొబైల్‌ నెంబర్‌ బ్లాక్‌ అయిన నేపథ్యంలో సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీని విచారించగా నెట్‌వర్క్‌ సమస్య ఉండవచ్చునని వేరొక సిమ్‌ కార్డు ఇచ్చారు. వేరే సిమ్‌ కార్డు వేసుకున్న తర్వాత మొబైల్‌ యాక్టివేట్‌ కావడమే కాకుండా కాల్‌ సౌకర్యం ప్రారంభం అయింది. అయితే ఎస్‌ఎంఎస్‌ సౌలభ్యం 24 గంటల తర్వాత లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆ మేరకు ఈ 24 గంటల గడువులో వంచకులు బాధితుడి వివిధ బ్యాంక్‌ ఖాతాల నుంచి రూ.6,39,521 బదలాయించుకొని వంచించారని బాధితుడు నగర సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా వాడుకొని రూ.1.68 లక్షలు బదలాయించుకొని వంచించిన ఘటన నగరంలో వెలుగు చూసింది. స్థానిక రాజనగర శ్రీహర్ష సత్తిగేరి అనే బాధితుడు ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లే మార్గమధ్యంలో మొబైల్‌ పోగొట్టుకున్నాడు. ఆ మొబైల్‌ను చేజిక్కించుకున్న గుర్తు తెలియని వ్యక్తులు అందులో ఉన్న ఫోన్‌పేను అక్రమంగా వాడుకొని వేర్వేరు బ్యాంక్‌ ఖాతాలకు మొత్తం రూ.1,68,901 బదలాయించుకొని వంచించినట్లు శ్రీహర్ష నగర సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement