
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
తిమ్మాపూర్: మండలంలోని ఎల్‌ఎండీ డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి కనుకయ్య(61) రోజూ మాదిరిగానే చేపలు పట్టేందుకు ఈనెల 28న ఎల్‌ఎండీలోని రిజర్వాయర్‌కు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తెప్పపై నుంచి పడి నీళ్లలో పడి మునిగిపోయాడు. నరేడ్ల రవి అనేవ్యక్తి కనుకయ్య కుటుంబ సభ్యులకు, పోలీసులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి కుమారుడు పిల్లి సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.