వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ | - | Sakshi
Sakshi News home page

వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ

May 28 2025 11:53 AM | Updated on May 28 2025 11:53 AM

వందేళ

వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ

కరీంనగర్‌: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ ఒక్కటేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నా రు. సీపీఐ కరీంనగర్‌ జిల్లా 23వ మహాసభలు నగరంలోని మధుగార్డెన్‌లో మంగళవారం ప్రా రంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్‌ నా యకుడు వేముల వెంకట్రాజం ఆవిష్కరించారు. అమరవీరుల స్మారకస్తూపం చిహ్నా న్ని శ్రీరా ముల రామచంద్రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజౖ రెన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ను దూరం చేసుకుని అధికారా న్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్‌ఎస్‌ ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ నాలుగు లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ పోరా టం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, అందెస్వామి, టేకుమల్ల సమ్మయ్య, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కమ్యూనిస్టులకు దూరమై బీఆర్‌ఎస్‌ అధికారాన్ని పోగొట్టుకుంది

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ1
1/1

వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement