
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రారంభం
కామారెడ్డి రూరల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టి న ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టు అమలులో భాగంగా సోమవారం చినమల్లారెడ్డి క్లస్టర్ పరిధి లోని పాతరాజంపేటలో రైతుల నమోదు కా ర్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారె డ్డి ఏడీఏ అపర్ణ మాట్లాడుతూ ప్రతి రైతు నుంచి వివరాలు సేకరించి ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేస్తామన్నారు. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రైతు సంక్షేమ పథకాలకు ఈ కార్డు ప్రామాణికం కానుంద న్నారు. రైతులందరూ వివరాలు నమోదు చే సుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమా ర్, ఏఈవో శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ బ క్కన్నగారి రాజు, రైతులు నరేష్, రాజయ్య, లక్ష్మణ్, బాల్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు.