
ఢిల్లీ ఎయిమ్స్‌లో జాన్వికి సీటు
చాగల్లు: గ్రామానికి చెందిన గారపాటి జాన్వి పద్మజ చౌదరి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ (ఎయిమ్స్)లో సీటు సాధించింది. ఎయిమ్స్ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఆమె ఆలిండియా 163వ ర్యాంకు సాధించి ఈ ఘనత సాధించింది. ఆమె వైజాగ్ ఆంధ్ర మెడికల్ కళాశాల (కేజీహెచ్)లో ఎంబీబీఎస్ చేసిన ఆమె ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ప్రతిభ చూపింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు గారపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపంపతుల ప్రోత్సాహంతో ఈ సీటు సాధించడంపై బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.