
హామీలు అమలయ్యే వరకూ ప్రజా పోరాటం
గద్దెనెక్కేందుకు చంద్రబాబు మాయమాటలతో ప్రజలను నమ్మించారు. కౌంటింగ్ అయిన అనంతరం జూన్ 24 నుంచి హామీలన్నింటినీ అమలు చేస్తానన్న బాబు.. గద్దెనెక్కి ఏడాదైనా వాటిని గాలికొదిలేశారు. ఆయన ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడటానికి క్యాడర్ సిద్ధంగా ఉంది. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
– దాట్ల సూర్యనారాయణరాజు, పార్టీ కాకినాడ
పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు
హామీలను గంగలో కలిపేశారు
ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు గంగలో కలిపేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకూ ప్రజల తరఫున పోరాడటానికి అందరూ సమన్వయంతో ముందుకు రావాలి. వైఎస్సార్ సీపీ ఓడిపోయిందంటే ఎవరూ నమ్మడం లేదు. జగన్ జనాదరణ కలిగిన నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టే ఎక్కడకు వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా వ్యతిరేకతను నిలువరించడం అసాధ్యం.
– విప్పర్తి వేణుగోపాలరావు,
జెడ్పీ చైర్మన్

హామీలు అమలయ్యే వరకూ ప్రజా పోరాటం