చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు

May 31 2025 12:24 AM | Updated on May 31 2025 12:24 AM

చిల్ల

చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు

డిగ్రీ పూర్తి చేశాను. అయినా ఉద్యోగం రాలేదు. అయినా అక్కడితో ఆగిపోకుండా ఎంబీఏ, పీజీ కూడా చేశాను. ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇంతలో సరిగ్గా ఏడాది క్రితం ఎన్నికలు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి నేతలు చెప్పారు. ఆ మాటలు నమ్మా. అయినా ఉద్యోగం రాలేదు. పోనీ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అయినా ఇస్తారని ఎదురు చూశాను. కూటమి అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదైంది. ఒక్క రూపాయి కూడా భృతి ఇవ్వలేదు. 2014లో కూడా చంద్రబాబు ఇలాగే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గాలికొదిలేశారు.

– బొండాడ సుధాకర్‌, సర్పవరం, కాకినాడ రూరల్‌

అబద్ధాలతో బాబు మరో మోసం

ఎప్పుడూ చెప్పే అబద్ధాలతో చంద్రబాబు నిరుద్యోగులను మరోసారి మోసం చేశారు. 2014లో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి తూతూ మంత్రంగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చునని ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాలు కల్పించడం లేదు. అలాగని భృతి కూడా ఇవ్వడం లేదు. ఇలా దగా చేయడం అన్యాయం. బాబు అబద్ధాలు నమ్మి యువత మోసపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోని చంద్రబాబును ఇకపై ఎవ్వరూ నమ్మరు.

– పెంకే రవితేజ, కన్వీనర్‌,

నిరుద్యోగ యువత జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా

బాబు వచ్చే.. జాబు పోయే

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఉన్న ఉద్యోగాలు ఊడబెరికేస్తూంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధికారంలోకి రాగానే 20 లక్షల కొత్త ఉద్యోగాలిస్తామని నమ్మించారు. తీరా గద్దెనెక్కాక మద్యం దుకాణాల్లో పని చేసే 12 వేల మంది ఉద్యోగులను తొలగించి, 25 వేల కుటుంబాల పొట్ట కొట్టారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దనే నిత్యావసర సరకులు అందజేయడానికి ఏర్పాటు చేసిన రేషన్‌ వాహనాలను ఎత్తేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల మంది ఉద్యోగులను ఒక్క కలంపోటుతో తొలగించి, వారి ఉసురు పోసుకున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలిచింది. నేటి కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను తొలగించి నిరుద్యోగ యువతను దగా చేస్తోంది.

– తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ

చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు 
1
1/2

చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు

చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు 
2
2/2

చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement