
జగిత్యాల
న్యూస్‌రీల్
ఘనంగా గంగమాతకు బోనాలు
మల్లాపూర్: మండలంలోని వేంపల్లిలో శుక్రవారం
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీగంగామాతకు బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనాలతో వెళ్లారు. గ్రామపురవీధుల వెంట గంగపుత్రులు గొల్లెంతో చేసిన విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, గంగపుత్ర సంఘం నాయకుడు
గుమ్ముల లింగారెడ్డి, గంగపుత్ర సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025