ఫిట్‌గా ఉన్నాయా? | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌గా ఉన్నాయా?

Jun 6 2025 6:13 AM | Updated on Jun 6 2025 6:13 AM

ఫిట్‌

ఫిట్‌గా ఉన్నాయా?

జగిత్యాలక్రైం:

వేసవి సెలవుల అనంతరం మరోవారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవే టు పాఠశాలల విద్యార్థులను వాహనాల్లో ఇంటి నుంచి తీసుకెళ్లి సాయంత్రం దింపేస్తుంటారు. చి న్నారులను తీసుకెళ్లే వాహనాలు ఫిట్‌గా ఉండాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యాసంస్థల ప్రారంభానికి ముందు రవాణాశాఖ అధికారులు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అన్ని సరిగా ఉంటే రోడ్డెక్కేందుకు అనుమతి పత్రం జారీ చేస్తారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన వాహనాలు 507 ఉండగా.. బుధవారం వరకు 201 వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. మరో 306 వాహనాలు ఫిట్‌నెస్‌ పరీక్షలకు రావాల్సి ఉందని రవా ణాశాఖ అధికారులు వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు ఫిట్‌నెస్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

గడువులోపు ప్రైవేటు పాఠశాలల బస్సులకు పాఠశాల యాజమాన్యాలు విధిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలి. జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లిలో ఉన్న జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు 201 వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. గతేడాది ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో ఫిట్‌నెస్‌ ఉంటేనే వాహనాలను రోడ్లపై తిప్పాలని, అతిక్రమిస్తే సీజ్‌ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ నిబంధనలు

పాఠశాల బస్సు 15ఏళ్ల కాలపరిమితి దాట కూడదు. విద్యాసంస్థల వాహనాలు పసుపు రంగులోనే ఉండాలి. డ్రైవర్‌కు హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ ఉండాలి. వయస్సు 60ఏళ్లలోపు ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. బస్సుపై కుడి ఎడమ వైపు పాఠశాల పేరు, చిరునామా స్పష్టంగా రాయాలి. వాహనం ఆగితే బ్లింక్‌ అయ్యేలా పైభాగంలో నాలుగు వైపులా అంబర్‌ లైట్లు ఉండాలి. బస్సులో ప్రథమ చికిత్స పెట్టె, మంటలను ఆర్పే వ్యవస్థ ఉండాలి. కిటికీలకు అడ్డంగా మూడు కడ్డీలు ఉండాలి. నేల నుంచి 325 మిమీ ఎత్తులో మెట్లు, ఎక్కేందుకు హ్యాండ్‌ రెయిలింగ్‌ ఉండాలి. అత్యవసర ద్వారం, బస్సు డ్రైవర్‌, అటెండర్‌ ఫోన్‌ నంబర్లు విధిగా ఉండాలి. డ్రైవర్‌కు బీపీ, షుగర్‌, కంటి పరీక్షలను చేయించాలి. సీరియల్‌ నంబర్‌తో కూడిన ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలి. టీఎస్‌ స్కూల్‌ యాప్‌ ద్వారా విద్యా సంస్థ పేరు, డ్రైవర్‌, అటెండర్‌ పేరు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి స్కూల్‌యాప్‌లో పొందుపర్చాలి.

ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలపై రవాణాశాఖ దృష్టి

కొనసాగుతున్న వాహన సామర్థ్య పరీక్షలు

రోడ్డెక్కాలంటే ఫిట్‌నెస్‌ తప్పనిసరి

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు

జిల్లాలో 507 ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలు

నిబంధనలు పాటించాలి

పాఠశాలలు, కళాశాలల యజమానులు నిబంధనలు పాటించాలి. బస్సులకు విధిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్‌నెస్‌ లేకుండా పాఠశాల బస్సులు రోడ్లపై తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతాం.

– భద్రునాయక్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

ఫిట్‌గా ఉన్నాయా?1
1/1

ఫిట్‌గా ఉన్నాయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement