మాస్క్‌ ధరిస్తే రూ.350 కట్టాలంట !

Usa: California Cafe Charges $5 People Wearing Mask Fine  - Sakshi

కాలిఫోర్నియా: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేఫ్‌లో మాస్క్‌ ధరిస్తే ఫైన్‌ కట్టాలంట. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఓ కేఫ్‌ యజమాని ఈ వింత రూల్‌ని పెట్టాడు. అదేంటి ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అల్లాడిపోతూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటిస్తుంటే ఇక్కడ మాత్రం ఇలాంటి రూల్‌ పెట్టారని అనుకుంటున్నారా? అసలు ఆ కేఫ్‌ యజమాని కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం.

ఓ కేఫ్‌ యజమాని తన కస్టమర్లలో మాస్క్‌ ధరించిన వారి నుంచి బిల్లుపై 5 డాలర్లు (సుమారు 350 రూపాయలు) అదనంగా కట్టించుకుంటున్నాడు. దీనికి ఓ కారణం ఉందని ఆ యజమాని అంటున్నాడు. వారు ఈ మొత్తాన్ని గృహహింస బాధితులకు సహాయపడే స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో వీరు చేస్తున్న మంచి పనిని కస్టమర్లు సైతం స్వాగతిస్తున్నారు. అంతే గాక అదనుపు బిల్లు చెల్లించడంలోనూ వెనకాడటం లేదు. ‘మొదట్లో 5 డాలర్లను కొంతమంది కస్టమర్లు చెల్లించగా, మరికొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని’ కేఫ్ యజమాని క్రిస్ కాజిల్మాన్ ఎన్బిసి న్యూస్కు చెప్పారు.

చదవండి: బీప్‌: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్‌ లెక్చరర్‌కు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top