ఆరామ్‌కోపై హౌతీల దాడి  | Houthi missile hits Aramco head quarters building | Sakshi
Sakshi News home page

ఆరామ్‌కోపై హౌతీల దాడి 

Oct 15 2026 5:57 AM | Updated on Oct 15 2026 5:57 AM

Houthi missile hits Aramco head quarters building

కైరో: సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరాంకోకు చెందిన ధహ్రాన్‌లోని ప్రధాన కార్యాలయంపై మంగళవారం రాత్రి హౌతీ రెబెల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయ భవనంలోని ఉన్నతాధికారులు ఉపయోగించే పై మూడు అంతస్తులు దెబ్బతిన్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం కూడా ఇందులో ఉందని, ప్రాణనష్టం సంభవించలేదన్నారు. చెలరేగిన కొద్దిపాటి మంటలను అదుపు చేశాని చెప్పారు. 

తమ కార్యకలాపాలన్నీ యథా ప్రకారం వర్క్‌ ఫ్రం హోం విధానంలో కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని రియాద్‌లో బుధవారం ఉదయం పలు చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రియాద్‌పైకి, కీలక మిలటరీ స్థావరాలున్న అల్‌–ఖర్జ్‌ దిశగా దూసుకు వస్తున్న బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు సౌదీ సారథ్యంలోని సైనిక కూటమి ప్రకటించింది. ఇలా ఉండగా, సౌదీ అరేబియాతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలంటూ చైనా, రష్యా తదితర దేశాలు ఇరాన్‌ ద్వారా తమను కోరాయని హౌతీ రెబెల్స్‌ ప్రకటించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement