26 అడుగుల వరకు వైరస్‌ వ్యాప్తి

6 feet may not always be enough distance to protect from COVID-19 - Sakshi

ఆరడుగుల భౌతిక దూరం సరిపోదు

తాజా సర్వేలో వెల్లడి

లండన్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం. ఇన్నాళ్లూ ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అనుకుంటూ వచ్చాం. కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్‌–19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది.

వైరస్‌ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది. అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్‌ఫార్డ్‌ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడైంది. తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మహిళల్లో ముప్పు తక్కువకి కారణమిదే !
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 గణాంకాల ను పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషులకే వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు అన్వేషించారు. వారి పరిశోధనల్లో మహిళల్లో సెక్స్‌ హార్మోన్‌ ఈస్ట్రోజన్‌ వల్ల వైరస్‌ సోకే ముప్పు తక్కువగా ఉందని తేలింది. కరోనా వైరస్‌ సోకితే గుండె మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. అదే విధంగా కరోనా వైరస్‌ ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్‌ అడ్డుపడు తుందని, దీం తో వైరస్‌ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ లియాన్నె గ్రోబన్‌ చెప్పారు. తాము చేసిన అధ్యయనం కోవిడ్‌ చికిత్సకి పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top