
గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్‌కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్‌డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్‌లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్‌లో 10 మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్‌లో 60, సైన్స్‌లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో 66, సోషల్ సైన్సెస్‌లో 88, ఎడ్యుకేషన్‌లో 25, లా 72, ఇంజనీరింగ్‌లో 44 మందికి గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేయనున్నారు.
కళాశాలలకు గోల్డ్‌మెడల్స్
అభ్యర్థుల జాబితాలు..
పీహెచ్‌డీ పట్టాలు పొందే అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్‌లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్‌కు కూడా ఎంట్రీపాస్‌లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్‌మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా అభ్యర్థులకు అడ్మిట్‌కార్డులు, ఎంట్రీపాస్‌లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్‌మెడల్స్ పొందే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్‌లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది.
ముందుగానే గోల్డ్‌మెడల్స్ ప్రదానం..
యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్‌మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్‌మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటా యించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్ డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్‌మెడల్స్ అభ్యర్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జి ష్ణుదేవ్‌వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది అభ్యర్థులను 19బ్యాచ్‌లుగా చేశారు. అయి తే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొంద రు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకువెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.
పేరెంట్స్‌కు ఆడిటోరియం బయట
స్క్రీన్ ఏర్పాటు
పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్‌మెడల్స్ పొందే అభ్యర్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు.
నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రాక
ముఖ్య అతిథిగా హాజరుకానున్న
ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
387 మందికి పీహెచ్‌డీ పట్టాలు..
373 మందికి
564 గోల్డ్ మెడల్స్ ప్రదానం
అడ్మిట్‌కార్డులు, ఎంట్రీపాస్‌ల పంపిణీ
షెడ్యూల్ ఇలా...
గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్‌కు చేరుకుంటారు.
ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉద యం 11:25 గంటలకు చేరుకుంటారు.
ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనెట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనెట్ సభ్యులు గవర్నర్‌తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది.
ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్‌మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.
కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పీహెచ్‌డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్‌మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్‌లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది.
కేయూలో భారీ బందోబస్తు
కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ రానుండడంతో క్యాంపస్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మోహరించారు. కేయూ పోలీస్ స్టేషన్‌తోపాటు వివిధ పోలీస్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్‌లు ఉన్న అభ్యర్థులకు వివిధ కమిటీల బాధ్యులకు సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనెట్ సభ్యులకు ప్రెస్‌కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు.

గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక

గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక