స్నాతకోత్సవానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవానికి వేళాయె

Jul 7 2025 5:57 AM | Updated on Jul 7 2025 5:57 AM

స్నాత

స్నాతకోత్సవానికి వేళాయె

సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

డోలు వాయిస్తున్న కళాకారులు

ఖిలా వరంగల్‌: ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ఉర్సు కరీమాబాద్‌, రంగశాయిపేటలో బీరన్న వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ఆరాధ్యదైవమైన బీరప్పకు కురుమలు బోనాలు సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండల్లో ప్రీతికరమైన నైవేద్యం ఉంచి డోలు చప్పుళ్లు.. ఒగ్గు కళాకారుల నృత్యాల ఊరేగింపుతో కరీమాబాద్‌ వీధులు కిక్కిరిశాయి. స్థానిక ప్రజలు భవనాలు ఎక్కి ప్రత్యేక వేషధారణలోనున్న బీరన్నల కత్తుల విన్యాసాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఉదయం నుంచి ఆలయాల్లో ఊరేగింపుగా కురుమ కుల పెద్దలు నగరవాసులు జెండాలను నిలిపారు. పూజారులు బీరన్నకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారీగా చేరుకున్న భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బీరన్న స్వామి దేవాలయాలు కిటకిటలాడాయి.

బీరన్నకు తొలి బోనం..

సంతోషంగా ఉంది: మంత్రి సురేఖ

వరంగల్‌లో తొలి బోనం బీరన్నకే కావడం సంతోషంగా ఉందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉర్సు కరీమాబాద్‌ బీరన్న బోనాల ఉత్సవాల్లో నగర మేయర్‌ గుండు సుధారాణితో కలిసి మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బీరన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కురుమ మహిళలతో కలిసి మంత్రి సురేఖ బీరన్న బోనాన్ని ఎత్తుకున్నారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి బోనం వరంగల్‌ భద్రకాళి అమ్మవారిదే అనుకున్నా.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంకల్పం ఆగిపోయిందని, త్వరలో పునరాలోచన చేసి ప్రకటిస్తానన్నారు. అదేవిధంగా 12వ డివిజన్‌ దేశాయిపేట బీరన్న దేవాలయంలో మంత్రి కొండా సురేఖ, ఓసిటీలో మేయర్‌ గుండు సుధారాణి బోనం ఎత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, బీజేపీ నాయకులు గంట రవికుమార్‌ బీరన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

న్యూస్‌రీల్‌

గావుపట్టి బీరన్నల రక్త తిలకం

భక్తి పారవశ్యంతో ఊగిపోయిన భక్తులు

ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు

బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ,

మేయర్‌ గుండు సుధారాణి

స్నాతకోత్సవానికి వేళాయె1
1/3

స్నాతకోత్సవానికి వేళాయె

స్నాతకోత్సవానికి వేళాయె2
2/3

స్నాతకోత్సవానికి వేళాయె

స్నాతకోత్సవానికి వేళాయె3
3/3

స్నాతకోత్సవానికి వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement