ఎన్నికల్లో కాపుల సత్తా చూపిద్దాం | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో కాపుల సత్తా చూపిద్దాం

Published Thu, May 9 2024 8:45 AM

ఎన్నికల్లో కాపుల సత్తా చూపిద్దాం

పెదకాకాని: సామాజిక వర్గం అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కాపుల సత్తా నిరూపించుకోవాలని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పెదకాకాని శివారులోని ఎస్‌.కన్వెన్షన్‌లో బుధవారం రాత్రి పెదకాకాని మండలం కాపు సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపు సంఘం నాయకుడు మాదా రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కాపులకు మంచి గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. కాపుల జనాభా లెక్క ప్రకారం రాజ్యాధికారం దిశగా ప్రాధాన్యత ఇచ్చిన ఏకై క ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిన మంచి ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

21 సీట్లతో రాజ్యాధికారం వస్తుందా..?: అంబటి మురళీకృష్ణ

టీడీపీ పవన్‌ కల్యాణ్‌ కు కేటాయించిన 21 సీట్లతో రాజ్యాధికారం వస్తుందా అని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. పొన్నూరు వచ్చిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ అంబటి మురళీకృష్ణకు, కిలారి వెంకట రోశయ్య ఓటు వేయొద్దని చెప్పలేదని, అయితే టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు ఎంపీ సీటు, పొన్నూరు ఎమ్మెల్యే సీట్లు కాపులకు కేటాయిస్తే కాపులు ఓడించాలని చెప్పడం న్యాయమా అన్నారు. కాపు సంఘం నాయకులు వాసా మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు ఆకుల వెంకటేశ్వరరావు, అమ్మిశెట్టి శివశంకర్‌రావు, తోట శ్రీనివాసరావు, నడింపల్లి కోటేశ్వరమ్మ, దంతాల శివ పార్వతి, బందెల ఉదయ శంకర్‌, బొలిశెట్టి విజయ్‌ కుమార్‌, అల్లా వెంకట్రావు, బెజవాడ శివయ్య, ఆలపాటి రాఘవ, తోటకూర వెంకటేశ్వరావు, గుమ్మడి వెంకట్రావు, కానుగోలు శంకర్‌రావు, పల్లంపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆదిలోనే పవన్‌ కల్యాణ్‌కు వెన్నుపోటు : చందు సాంబశివరావు

ఆదిలోనే టీడీపీ సీట్లు కేటాయించే విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వెన్నుపోటు పొడిచిందన్నారు. జనసేనకు 30 సీట్లు 40 సీట్లు ఇస్తామని చెప్పి 21 సీట్లు కేటాయిస్తే కాపులకు రాజ్యాధికారం వస్తుందా ముమ్మాటికీ కాపులను అణగదొక్కటమే అన్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జన సమీకరణ అవసరం లేకుండా ఉపయోగపడతాడని ఒక వ్యూహం ప్రకారమే టీడీపీ వాడుకుంటుందన్నారు. జనసేనకి ఇచ్చిన 21 సీట్లతో పవన్‌ కల్యాణ్‌ రాజ్యాధికారం సాధించేది లేదు, కాపులకు మేలు జరిగేది లేదని స్పష్టం చేశారు.

కాపు అభ్యర్థులను గెలిపించుకుందాం

కాపుల ఆత్మీయ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం సీఎం జగన్‌ పాలనలోనే కాపులకు గుర్తింపు టీడీపీ కాపులను ఓటు బ్యాంకుగానే చూస్తోంది కాపులను అణగదొక్కడమే టీడీపీ లక్ష్యం

కాపులను వెన్నుపోటు పొడిచిన టీడీపీ

డాక్టర్‌ టీవీ రావు

కాపులను రాజకీయంగా ఎదగనీయకుండా వెన్నుపోటు పొడుస్తున్న టీడీపీకి కాపు సోదరులందరూ బుద్ధి చెప్పాలని డాక్టర్‌ పీవీ రావు అన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో కాపులకు వైఎస్సార్‌ సీపీ 31 ఎమ్మెల్యే టికెట్లు, 5 ఎంపీ టికెట్లు కేటాయిస్తే టీడీపీ కాపుల్లో పోటీ చేసే అభ్యర్థులు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అర్హత ఉన్న కాపులే కనిపించలేదా అని ప్రశ్నించారు. ఎక్కువ ఓట్లు కలిగిన కాపు సామాజిక వర్గానికి తక్కువ సీట్లు, తక్కువ ఓట్లు కలిగిన కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తూ కాపులను కేవలం ఓటు బ్యాంకుగా టీడీపీ వాడుకుంటుందన్నారు. కాపు అభ్యర్థుల గెలుపే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement