నేడు గుంటూరు ‘బార్‌’ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరు ‘బార్‌’ ఎన్నికలు

Published Thu, Mar 28 2024 1:40 AM

-

● ఉదయం 10 నుంచి ఓటింగ్‌.. రాత్రికి లెక్కింపు

నగరంపాలెం: ది గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నగరంపాలెం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సంఘ కార్యాలయంలో ఓటింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4.30 వరకు ముగియనుంది.

పోలింగ్‌ పక్రియ ముగిసిన తర్వాత లెక్కింపు పక్రియ మొదలుకానుంది. రాత్రికల్లా గెలుపు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. అయితే ఓటింగ్‌ కోసం మూడు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చే అసోసియేషన్‌ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బార్‌ అసోసియేషన్‌ పరిధిలో 1,942 మంది న్యాయవాదులు ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు నగరంపాలెం పీఎస్‌ పోలీసులు బందోబస్త్‌ నిర్వహించనున్నారు.

అభ్యర్థులు వీరే..

అధ్యక్ష పదవి (ఒక్క పోస్ట్‌)కి యంగలశెట్టి శివసూర్యనారాయణ (బబ్లూ), కాసు వెంకటరెడ్డి, ఉపాధ్యక్ష పదవి (ఒక్క పోస్ట్‌)కి ఎం.దేవరాజు (దేవ), బీవీ.గౌరీశంకర్‌, ఏపీ లాలీ, చింతా రామకోటిరెడ్డి (డాక్టర్‌ రామకోటిరెడ్డి), ప్రధాన కార్యదర్శి పదవి (ఒక్కపోస్ట్‌)కి యర్రసాని అజయ్‌కుమార్‌, గురజాల అనురాధ, మోదుకూరి శ్రీనివాసరావు, సుబ్బయ్య లక్కీ, సంయుక్త కార్యదర్శి పదవి (ఒక్క పోస్ట్‌)కి కట్టా నరసింహాం, విజయవర్మ, కోశాధికారి పదవి (ఒక్క పోస్ట్‌)కి కలే దేవదాసు, మేడికొండూ మల్లిఖార్జునరావు, లైబ్రరీ కార్యదర్శి పదవి (ఒక్క పోస్ట్‌)కి పల్లె నరసింహారావు (పీఎన్‌ఆర్‌), బొప్పా శ్రీనివాసరావు, క్రీడ, కల్చరల్‌ కార్యదర్శి పదవి (ఒక్క పోస్ట్‌)కి ఇస్మాయిల్‌ సయ్యాద్‌, పూదోట రాజేష్‌లింగం, గండికోట శేషగిరిరావు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (మూడు పోస్ట్‌లు) పదవులకు షేక్‌.మస్తాన్‌వలి, తోట నాగసాయిరామ్‌, బర్మా రాజశేఖర్‌, షేక్‌.రిహానాబేగం, రాయపూడి శ్రీనివాసరావు (గుండు శ్రీను), మోర్ల వెంకటకృష్ణ బరిలో ఉన్నారు.

Advertisement
Advertisement