ఎక్కువ టైం లేదా? క్షణాల్లో గుడ్డుతో ఇలా వండేసుకోండి | Best Egg Snacks: How To Make Egg Paniyaram (Egg Ponganalu) Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Egg Paniyaram Recipe: ఎక్కువ టైం లేదా? క్షణాల్లో గుడ్డుతో ఇలా వండేసుకోండి

Sep 12 2023 4:55 PM | Updated on Sep 12 2023 5:49 PM

How To Make Egg Paniyaram Recipe In Telugu - Sakshi

ఎగ్‌ పనియారం తయారీకి కావల్సినవి:

గుడ్లు – నాలుగు; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా;
ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – ఒకటి; క్యాప్సికం – ఒకటి; క్యారట్‌ – ఒకటి;
బంగాళ దుంప – ఒకటి; కారం – అరటీస్పూను; ధనియాల పొడి – అరటీస్పూను;
పసుపు – చిటికెడు; గరంమసాలా – పావుటీస్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను; నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ విధానమిలా:
క్యారట్, పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ, బంగాళ దుంపలను సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
► బాణలిలో టేబుల్‌ స్పూను నూనె వేసి కాగనివ్వాలి. బాగా వేడెక్కిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
► ఉల్లిపాయ వేగాక క్యారట్, బంగాళ దుంప ముక్కలు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గాలి.
► తరువాత క్యాప్సికం ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి ∙ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుసు, గరంమసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
► ముక్కలన్నీ చక్కగా మగ్గాక కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలిపి దించేయాలి ∙ఒకగిన్నెలో గుడ్లసొన, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంతవరకు కలుపుకోవాలి ► ఇప్పుడు చల్లారిన ముక్కల మిశ్రమం గుడ్లసొనలో వేసి కలపాలి.
► పనియారం ప్లేటులో నూనెవేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టాలి.
► సన్నని మంటమీద మూడు నిమిషాలు కాల్చాలి. తరువాత రెండోవైపు తిప్పి నిమిషం పాటు కాల్చితే వేడివేడి ఎగ్‌ పనియారం రెడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement