కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు | - | Sakshi
Sakshi News home page

కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు

Jul 7 2025 6:25 AM | Updated on Jul 7 2025 6:25 AM

కడలిల

కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ నుంచి 2,18,257 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గాను 172 గేట్లను పైకి లేపి మిగులు జలాలు విడిచిపెడుతున్నారు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 12,450 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,200, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 5,800 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులుగా నమోదైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటి ఉధృతి పెరిగిందని, సోమవారం నాటికి తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

12 వరకూ రేబిస్‌

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: ప్రపంచ జునోసిస్‌ డే సందర్భంగా రేబిస్‌ వ్యాధి నివారణకు ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించే ముందస్తు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జంతువుల నుంచి, ప్రధానంగా కుక్కల నుంచి వ్యాపించే ప్రాణాంతక వ్యాధి రేబిస్‌ అని అన్నారు. ఇది నరాల వ్యవస్థను దెబ్బ తీసి మరణానికి దారి తీయవచ్చన్నారు. దీనిని యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ద్వారా పూర్తిగా నివారించవచ్చన్నారు. అందుకే, జంతువులతో క్రమం తప్పకుండా మసలే వ్యక్తు లు, పశు వైద్యులు, పారిశుధ్య కార్మికులు ముందస్తుగా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో ఈ నెల 12వ తేదీ వరకూ యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిడెమాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌బాబు పాల్గొన్నారు.

ఇంద్ర బస్సు ప్రయాణంలో రాయితీ

రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులు సూపర్‌ లగ్జరీ ధరకే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ కె.మాధవ్‌ ఆదివారం తెలిపారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు ఇంద్ర ఏసీ బస్సు టికెట్టు రూ.1,060 ఉండగా రాయితీపై రూ.920కే అందిస్తున్నామని తెలిపారు.

కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు 
1
1/2

కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు

కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు 
2
2/2

కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement