
చిరంజీవిని కుమారి మృతికి ప్రముఖుల సంతాపం
వైద్య కళాశాలకు భౌతికదేహం అందజేత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి.చిరంజీవిని కుమారి భౌతికదేహాన్ని సోమవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. అభిమానులు, పూర్వ విద్యార్థులు. ప్రజాప్రతినిధుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ప్రతాప్నగర్లోని ఆమె స్వగృహం నుంచి ఇంద్రపాలెం లాకుల వద్దనున్న ఐడియల్ కళాశాలకు ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆమె భౌతికకాయాన్ని రంగరాయ వైద్య కళాశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి అందజేవారు. ఆమెకు సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు, మురళీకృష్ణ, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పి.కృష్ణారావు, మాజీ రిజిస్ట్రార్ వి.రవీంద్ర, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సీపోర్టు సీఈఓ మురళీధర్, జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు, పూర్వ విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఉన్నారు.

చిరంజీవిని కుమారి మృతికి ప్రముఖుల సంతాపం