
నేడు సీఎం చంద్రబాబు రాక
ముమ్మిడివరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ముమ్మిడివరం, కాట్రేనికోనలో పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 12.50 గంటలకు హెలికాప్టర్లో సీహెచ్ గున్నేపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి 1.05 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యేరులో ఉపాధి హమీ పథకంలో చెరువు పూడిక తీత పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడతారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజలతో ముఖాముఖీ ఉంటుంది. అక్కడే జిల్లాకు సంబంధించి బంగారు కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సీహెచ్ గున్నేపల్లిలో 3.35 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 5.15 గంటలకు సీహెచ్ గున్నేపల్లి హెలీప్యాడ్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్సీ బి.కృష్ణారావు, చంద్రబాబు పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.