ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం

Published Thu, Mar 28 2024 2:00 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ షణ్మోహన్‌    - Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌ : క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షణ్మోహన్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఎన్నికల కసరత్తుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ మాట్లాడుతూ నిర్దిష్ట కాలపరిమితిలో అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీ విజిల్‌ యాప్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయిస్తున్నామని వివరించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.36 లక్షలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌ సెంటర్‌లో ఏర్పాట్ల నివేదికను పంపుతున్నట్లు తెలిపారు. ప్రచారానికి అనుమతులన్నీ ఆన్‌లైన్‌ విధానంలో ఇస్తున్నట్లు చెప్పారు. మోడల్‌ కోడ్‌ను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ పుల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement