Tata Motors Launches Altroz iCNG At Rs. 7.55 Lakh In Chennai, See Details Inside - Sakshi
Sakshi News home page

Tata Altroz iCNG: హైదరాబాద్‌ మార్కెట్లో టాటా అల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ.. ధర ఎంతంటే?

Jun 14 2023 8:16 AM | Updated on Jun 14 2023 10:26 AM

Tata Motors Launches Altroz Icng At Rs. 7.55 Lakh - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ అల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ వర్షన్‌ను హైదరాబాద్‌ మార్కెట్లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్‌ ధర ఎక్స్‌షోరూంలో రూ.7.55 లక్షల నుంచి రూ.10.55 లక్షల వరకు ఉంది. 

ట్విన్‌ సిలిండర్‌ సీఎన్‌జీ టెక్నాలజీతో ఆరు వేరియంట్లలో ఇది రూపుదిద్దుకుంది. ట్విన్‌ సిలిండర్లను భద్రతా కారణాల దృష్ట్యా లగేజ్‌ ఏరియా కింద ఏర్పాటు చేసినట్టు కంపెనీ తెలిపింది. 

ఇంధనం నింపే సమయంలో ఇంజన్‌ ఆఫ్‌ అవుతుంది. నిర్దిష్ట స్థాయిని మించి ఇంజన్‌ వేడెక్కితే సీఎన్‌జీ సరఫరా నిలిచిపోవడమేగాక గ్యాస్‌ను గాలిలోకి వదులుతుంది. వాయిస్‌ అసిస్టెడ్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్, వైర్‌లెస్‌ చార్జర్, ఎయిర్‌ ప్యూరిఫయర్, ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఆర్‌16 డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్, ఎనమిది స్పీకర్లతో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, ఆన్‌డ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement