రూపాయికి ట్రేడ్‌ వార్‌ సెగ | Rupee sinks 50 paise to settle at 86 26 against US dollar | Sakshi
Sakshi News home page

రూపాయికి ట్రేడ్‌ వార్‌ సెగ

Apr 9 2025 2:43 AM | Updated on Apr 9 2025 7:55 AM

Rupee sinks 50 paise to settle at 86 26 against US dollar

డాలర్‌ మారకంలో 50 పైసలు డౌన్‌; 86.26 వద్ద క్లోజ్‌  

మూడు నెలల్లో అతిపెద్ద పతనం

డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరో 50 పైసలు బలహీనపడి 86.26 వద్ద ముగిసింది. వాణిజ్య యుద్ధాలతో మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చనే భయాలు దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమయ్యాయి. యువాన్‌ క్షీణత, క్రూడాయిల్‌ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు మరింత ఒత్తిడి పెంచాయి. జనవరి 13 (66 పైసలు క్షీణత) తర్వాత భారత కరెన్సీకిదే అతిపెద్ద పతనం. 

ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం 85.89 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.82 వద్ద గరిష్టాన్ని, 86.29 వద్ద కనిష్టాన్ని తాకింది. ‘అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఫారెక్స్‌ మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. ఆర్‌బీఐ పాలసీ వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రానున్న రోజుల్లో 85.90 – 86.50 శ్రేణిలో ట్రేడవొచ్చు’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ నిపుణులు దిలీప్‌ పార్మర్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement