Ola Electric: బైక్‌ ఫీచర్లు మామూలుగా లేవుగా..!

Ola Scooter New Features Revealed - Sakshi

వరల్డ్‌ వైడ్‌గా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ గురించి వస్తున్న వార్తలు బైక్‌ లవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న లాంచ్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రి-బుకింగ్స్‌లో కూడా సంచలానాన్ని సృష్టించింది. బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన 24 గంటల్లోనే లక్షకుపైగా బైక్‌లు బుక్‌ అయ్యాయి. ఎలక్ట్రిక్‌ వాహన ప్రియులు ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లను ఏగబడిమరి  ప్రి-బుకింగ్స్‌ చేసుకున్నారు. 

తాజాగా భవీష్‌ అగర్వాల్‌ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్లును రిలీజ్‌ చేశాడు. ఈ స్కూటర్లు ఎలక్ట్రిక్‌ బైక్ల  విభాగంలో మరో సంచలనాన్ని సృష్టించనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ముందుకే కాదు వెనక్కి కూడా ప్రయాణించగలవని భవీష్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. రివర్స్‌ ఫీచర్‌తో పాటుగా కీ లెస్‌ స్టార్టింగ్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ సపోర్ట్‌ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్ సహాయంతో స్కూటర్‌ను యాక్సెస్ చేయవచ్చును. స్కూటర్‌లో బెస్ట్-ఇన్-సెగ్మెంట్ బూట్ స్పేస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్‌  స్కూటర్‌ సెగ్మెంట్‌-ఫస్ట్‌ లేదా సెగ్మెంట్‌ బెస్ట్‌గా నిలుస్తోందని కంపెనీ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top