హ్యాపీ న్యూస్‌ ఫర్‌ ఆదిలాబాద్‌

NTT Data Solutions Agreed To set up IT Company In Adilabad - Sakshi

అక్షరమాలలో మొదటి స్థానంలో ఉన్నా అభివృద్ధిలో చివరి వరుసలో ఉండే జిల్లాగా పేరు పడిన ఆదిలాబాద్‌ జిల్లాలో ఐటీ రంగం అడుగు పెట్టింది. ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ పెట్టేందుకు ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ సంస్థ అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది.  ఎట్‌టీటీ ఎండీ, సీఈవో సంజీవ్‌ దేశ్‌పాండేకు ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. 

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు వరంగల్‌ ఇతర జిల్లా కేంద్రాలకు ఐటీ పరిశ్రమను చేరువచేసే పనిలో ఉంది. ఇప్పటికే వరంగల్‌లో టెక్‌ మహీంద్రా, సెయింట్‌, మైండ్‌ట్రీ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలపగా ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో సైతం ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటి సరసన ఆదిలాబాద్‌ కూడా చేరింది. మిగిలిన జిల్లా కేంద్రాలతో పోల్చితే ఆదిలాబాద్‌కి అనేక ప్రతికూలతలు ఉన్నా.. అన్నింటినీ అధిగమించి ఐటీలో దూసుకుపోయేందుకు రెడీ అయ్యింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top