
ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన.. మైక్రోసాఫ్ట్ తన హైబ్రిడ్ పని నియమాలను మరింత కఠినతరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగులు ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాలని.. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని చెబుతోంది. ఈ రూల్ జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు ఆఫీసుకు రప్పించడానికి.. మైక్రోసాఫ్ట్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కంపెనీ సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. 2020 చివర నుంచి సౌకర్యవంతమైన పని జీవితాన్ని అందించిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు కొంత కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇదీ చదవండి: గూగుల్‌లో పర్సనల్ ఇంటర్వ్యూలు: సుందర్ పిచాయ్
వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ అమలు చేసిన తరువాత చాలామంది ఇంటి నుంచి పనిచేయడానికే అలవాటు పడిపోయారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పడానికి కంపెనీ తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలనే కొత్త విధానం అమలు చేయడానికి సంకల్పించింది. చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిపోవడం చేత.. మళ్ళీ ఆఫీసులకు రావాలంటే కొంత కష్టంగానే భావిస్తారు.