Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది

Mahindra Auto Will Introduce Sky Roof Feature In Upcoming MOdel XUV 700 - Sakshi

ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా సిద్దమవుతోంది. త్వరలో రాబోతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్‌ని అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుతోంది. ఈ మోడల్‌కి సంబంధించిన కీలక అప్‌డేట్‌ని మహీంద్రా అఫీషియల్‌గా రివీల్‌ చేసింది.

స్కై రూఫ్‌
గత రెండుమూడేళ్లుగా సన్‌ రూఫ్‌ ఫీచర్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌ యూటిలిటీ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్‌ క్రమంగా తప్పనిసరిగా మారింది. దీంతో మహీంద్రా సంస్థ నుంచి త్వరలో రాబోతున్న ఎక్స్‌యూవీ 700 మోడల్‌లో సన్‌రూఫ్‌ని మరింత ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు. స్కై రూఫ్‌ పేరుతో ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర కార్లకంటే పెద్దగా సన్‌రూఫ్‌ని డిజైన్‌ చేశారు. మహీంద్రా వెల్లడించిన వివరాల ప్రకారం 1360 మిల్లీమీటర్ల పొడవు, 870 మిల్లీమీటర్ల వెడల్పుతో స్కైరూఫ్‌ ఉంది.  

వీటికి పోటీగా
ఇండియాలో అమ్మకాలు ఎక్కువగా ఎస్‌యూవీ మోడళ్లైన ఎంజీ హెక్టార్‌, జీప్‌ కంపాస్‌, టాటా హారియర్‌, టాటా సఫారీ, ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీలలో పనోరమిక్‌  సన్‌రూఫ్‌ ఫీచర్‌ ఉంది. ఇ‍ప్పుడు వాటి కంటే పెద్ద సన్‌రూఫ్‌తో మహీంద్రా మార్కెట్‌లో అడుగు పెడుతోంది. అంతేకాదు వేగాన​ఇ బట్టి ఆటోమేటిక్‌గా లైటింగ్‌ అడ్జస్ట్‌ చేసే  ఆటో బూస్టర్‌ హెడ్‌ల్యాంప్‌ ఫీచర్‌ని సైతం మహీంద్రా యాడ్‌ చేసింది. వెహికల్‌ స్పీడ్‌ 80 కి.మీ దాటితే ఆటోమేటిగా లైటింగ్‌ పెరుగుతుంది. 

చదవండి : స్కోడా ఎలక్ట్రిక్‌ కార్లు త్వరలోనే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top