గరిష్ఠాలను చేరిన బంగారం ధర! | gold rates today on market in telugu states | Sakshi
Sakshi News home page

Today Gold Rate: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!

Oct 16 2024 11:42 AM | Updated on Oct 16 2024 11:53 AM

gold rates today on market in telugu states

ఇటీవల కాలంలో మదుపర్లు స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,400 (22 క్యారెట్స్), రూ.77,890 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 పెరిగింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,890 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

ఇదీ చదవండి: ‘స్మార్ట్‌’ ఉన్నా ఫీచర్‌ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.71,550కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.78,040 వద్దకు చేరింది. మార్కెట్‌లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గి రూ.1,02,900 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement