iPhone 14: మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్‌ కుక్‌ సర్‌ప్రైజ్‌ చేస్తారా?

Apple Far Out event:what can we expect this mega event - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌దిగ్గజం ఆపిల్‌ బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్‌ ఎవైటెడ్‌ ఐఫోన్‌ 14, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 8, ఇంకా ఎయిర్‌ పాడ్స్‌ ప్రొ-2, ఆపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్‌ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఆపిల్‌ సీఈవో టిమ్ కుక్ వేదికపై ఎలాంటి విప్లవాత్మక ఉత్పత్తులను లాంచ్‌ చేయనున్నారనేది హాట్‌ టాపిక్‌గా  మారింది. 

ఆపిల్‌ ఐఫోన్‌ 14: కోవిడ్‌ సంక్షోభం తరువాత నిర్వహిస్తున్న ఆపిల్‌ అతిపెద్ద ఈవెంట్‌ కావడంతో మరింత జోష్‌ నెలకొంది.  ఇప్పటివరకు వచ్చిన పుకార్లు , లీక్‌ల ప్రకారం భారీ అప్‌డేట్స్‌ తో  ఐఫోన్‌ -14 సిరీస్‌ను తీసుకొస్తోంది. 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లే, 48ఎంపీ బిగ్‌ కెమెరా, ఆన్‌లోనే ఉండే డిస్‌ప్లే లాంటివి ఇందులో ఉన్నాయి. 

ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ 8: ఆపిల్‌ 7 వాచ్‌ డిజైన్‌కు దగ్గరానేఈ కొత్త సిరీస్‌ ఉన్నప్పటికీ మరిన్ని విప్లవాత్మక మార్పులతో కొత్త వాచెస్‌ సీరిస్‌ను తీసుకొస్తోంది.   
ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ వాచ్ 8 ప్రో: అతిపెద్ద డిస్‌ప్లే, టైటానియం సూపర్‌ డిజైన్, అదనపు బటన్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకు రానుందని సమాచారం. 

ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2: తదుపరి జనరేషన్‌గా వస్తున్న వీటిల్లో  ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యాలను పెంచడంతో పాటు కొత్త డిజైన్‌తో లాంచ్‌ చేయనుంది. అలాగే కొత్త ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత స్పీకర్‌తో ఫైండ్ మై ఫంక్షనాలిటీ ఫీచర్‌ను కూడా జోడించిందిట. ఈ ఆపిల్  మెగా ఈవెంట్‌  ఆపిల్‌ డాట్‌కామ్‌,యూ ట్యూబ్‌లో లైవ్‌ ఉంటుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top