అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

Jun 6 2025 6:27 AM | Updated on Jun 6 2025 6:27 AM

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

దుగ్గిరాల: డ్రైవరు మద్యం మత్తులో ఉండగా అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లిది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చిలువూరు నుంచి కె.ఆర్‌.కొండూరు గ్రామం వైపు కారు వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు చూసి కారులోని డ్రైవరును బయటకు తీశారు. అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చిలువూరులో పక్కపక్కనే రెండు మద్యం దుకాణాలు ఉండటం వల్ల కొందరు నిత్యం తాగి వేగంగా ద్విచక్రవాహనాలు, కార్లను నడుపుతున్నారని స్థానికులు చెప్పారు. పలువురు ప్రమాదానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులకు అనేకసార్లు ఇక్కడ మద్యం దుకాణాలు తొలగించాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement