
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి ప.1.18 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం: శ్రవణం ఉ.8.41 వరకు, తదుపరి ధనిష్ట వర్జ్యం: ప.12.27 నుండి 1.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.32 నుండి 12.24 వరకు, అమృతఘడియలు: రా.9.31 నుండి 11.02 వరకు.
మేషం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థికంగా ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కన్య: విద్యార్థుల కృషి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృశ్చికం: కార్యజయం. ఆశ్చర్యకర సంఘటనలు. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనయోగం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవదర్శనాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
కుంభం: పనులలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయాల సందర్శనం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం: మానసిక ప్రశాంతత. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.