ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు | Today Telugu Horoscope On June 28th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు

Jun 28 2025 5:43 AM | Updated on Jun 28 2025 9:00 AM

  Rasi Phalalu: Daily Horoscope On 28-06-2025 In Telugu

    గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: శు.తదియ ప.12.22 వరకు తదుపరి చవితి, నక్షత్రం: పుష్యమి ఉ.9.30 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.10.22 నుండి 11.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.10.20 నుండి 11.55 వరకు

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది. రుణయత్నాలు. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

కన్య: కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆప్తుల నుండి పిలుపు రావచ్చు. వాహనాలు కొంటారు. ఆస్తులు సమకూరతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల: ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆరి<క పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.

మకరం: ఇంతకాలం శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. చర్చలు సఫలం. దూరపు  బంధువుల కలయిక. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

మీనం: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement