Today Horoscope In Telugu: Rasi Phalalu 19-06-2022 - Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ప్రముఖులతో పరిచయాలు

Published Sun, Jun 19 2022 6:08 AM

Today Horoscope 19-06-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.పంచమి ఉ.5.55 వరకు తదుపరి షష్ఠి తె.4.10 వరకు (తెల్లవారితే సోమవారం), నక్షత్రం ధనిష్ఠ ఉ.11.47 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం సా.6.40 నుండి 8.12 వరకు, దుర్ముహూర్తం సా.4.46 నుండి 5.24 వరకు, అమృతఘడియలు...రా.2.22 నుండి 3.55 వరకు.

సూర్యోదయం        :  5.30
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక చింతన. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.  విందువినోదాలు.

వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. భూ, గృహయోగాలు. అందరిలోనూ గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో ఆటంకాలు.ఉద్యోగమార్పులు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం. మానసిక అశాంతి.

సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువులతో సత్సంబంధాలు. వివాదాల పరిష్కారం.శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలోఅనుకూలత. 

తుల: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆస్తి వివాదాలు. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం.కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం. 

ధనుస్సు: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.

మకరం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆస్తి తగదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో లేనిపోని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గుర్తింపు. దైవదర్శనాలు. విందువినోదాలు.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరిన్ని మార్పులు. వాహనయోగం.  విద్యార్థుల యత్నాలు సఫలం. వస్తులాభాలు. 

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్య సూచనలు.  వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

Advertisement
Advertisement