
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.సప్తమి ప.2.43 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: రోహిణి ప.2.02 వరకు తదుపరి మృగశిర, వర్జ్యం: రా.8.09 నుండి 9.54 వరకు దుర్ముహూర్తం: ఉ.5.52 నుండి 7.29 వరకు అమృతఘడియలు: ఉ.10.33 నుండి 12.15 వరకు.
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.00
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
మేషం: వ్యవహారాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: చిత్రమైన సంఘటనలు. ప్రముఖులతో చర్చలు. వాహనాలు కొంటారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
మిథునం: దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కన్య: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల: బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
వృశ్చికం: కార్యజయం. ఆస్తుల వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు: సన్నిహితుల సాయం అందుతుంది. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.