Horoscope Today: October 08, 2022 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆస్తులు కొనుగోలు చేస్తారు

Oct 8 2022 6:43 AM | Updated on Oct 8 2022 9:28 AM

Today Horoscope 08-10-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.చతుర్దశి రా.3.22 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాభాద్ర సా.5.54 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.3.14 నుండి 4.47 వరకు దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.27 వరకు అమృతఘడియలు: ఉ.10.12 నుండి 11.15 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు కొంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: బంధువుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

తుల: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందగోళం తొలగుతుంది.

మకరం: కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

కుంభం: కొన్ని శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మీనం: కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement