
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.నవమి రా.3.10 వరకు తదుపరి దశమి, నక్షత్రం ఉత్తర రా.12.07 వరకు తదుపరి హస్త, వర్జ్యం ఉ.6.54 నుండి 8.32 వరకు దుర్ముహూర్తం ప.11.33 నుండి 12.23 వరకు అమృతఘడియలు... సా.4.43 నుండి 6.22 వరకు.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం...కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
వృషభం...కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం కాస్త తగ్గుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు ఒత్తిడులు.
మిథునం...దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు పనిభారం.
కర్కాటకం......కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలం.
సింహం....కొన్ని కార్యక్రమాలను హఠాత్తుగా విరమిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు కష్టమే.ఉద్యోగులకు పనిభారం.
కన్య....ఆదాయం ఆశాజనకం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆశించిన కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
తుల...కార్యక్రమాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.
వృశ్చికం....ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
ధనుస్సు..కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అదనపు ఆదాయం. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలస్థితి.
మకరం...ఆదాయం నిరాశ పరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. శారీరక రుగ్మతలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.
కుంభం...ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు సామాన్యస్థితి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.
మీనం...కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. భూములు, గృహం కొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.