
నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి..
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం,
తిథి: శు.ద్వాదశి ఉ.11.10 వరకు, తదుపరి త్రయోదశి,
నక్షత్రం: స్వాతి తె.5.21 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి విశాఖ, ఉ.10.25 నుండి 12.05 వరకు,
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.26
దుర్ముహూర్తం: ఉ.9.46 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.52 వరకు,
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ. 6.00 నుండి 7.30 వరకు
అమృతఘడియలు: రా.8.17 నుండి 9.55 వరకు.
గ్రహబలం
మేషం: పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి.
మిథునం: పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పనులలో జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు సంభవం. ఆరోగ్యభంగం.
ధనుస్సు: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మకరం: ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కుంభం: బంధువర్గంతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.
మీనం: పనుల్లో జాప్యం. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు అసంతృప్తి కలిగిస్తాయి.