ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. | Rasi Phalalu: Daily Horoscope On 10-05-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

May 10 2025 5:23 AM | Updated on May 10 2025 8:28 AM

Rasi Phalalu: Daily Horoscope On 10-05-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.59 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: చిత్త రా.2.48 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.9.09 నుండి 10.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.7.46 నుండి 9.33 వరకు, శనిత్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.34, సూర్యాస్తమయం: 6.17. 

మేషం: శుభకార్యాల ప్రస్తావన. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.

కర్కాటకం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.  వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

సింహం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కన్య: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

తుల: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement